'లిటిల్ హార్ట్స్' హీరోకి కోటి రూపాయల ఆఫర్.. మామూలు లక్ కాదు!
on Oct 13, 2025

సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చెప్పలేము. ఒక్క సినిమాతో కొత్త స్టార్స్ పుట్టుకొస్తారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'లిటిల్ హార్ట్స్' అలాంటి సినిమానే. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. ఏకంగా రూ.38 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. 'లిటిల్ హార్ట్స్'లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. దర్శకుడు సాయి మార్తాండ్ కి హీరో నితిన్ తో సినిమా లాక్ అయినట్లు తెలుస్తోంది. అలాగే పలు ప్రొడక్షన్ హౌస్ లు అతనికి అడ్వాన్స్ లు ఇస్తున్నాయట. హీరోయిన్ శివాని నాగారం, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన జై కృష్ణకు కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయట. ఇక హీరో మౌళికి అయితే భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి అంటున్నారు.
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పలు నిర్మాణ సంస్థలు మౌళికి అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసే పనిలో ఉన్నాయట. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ, కొంత మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి బాటలోనే మరికొన్ని నిర్మాణ సంస్థలు కూడా మౌళికి అడ్వాన్స్ లు ఇచ్చే పనిలో ఉన్నాయట.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. 'లిటిల్ హార్ట్స్'తో హీరోగా మారాడు. ఆ సినిమాకి అతను అందుకున్న రెమ్యూనరేషన్ రూ.5 లక్షలకు అటుఇటుగా ఉంటుందని వినికిడి. అలాంటిది ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయల ఆఫర్ రావడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇలాగే మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు అందిస్తూ.. హీరోగా మరింత ఎదుగుతాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



