'లయన్' లిప్ లాక్ చేశాడా?
on Apr 22, 2015

సాధారణంగా బాలకృష్ణ సినిమాలంటే యాక్షన్ సీన్లు, పవర్ ఫుల్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని తెలుసు. కాని ప్రస్తుతం తను నటిస్తున్న 'లయన్' సినిమాలో మాత్రం రొమాంటిక్ సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయని ఫిలిం వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమాలో బాలయ్య, త్రిషల మధ్య లిప్ లాక్ సన్నివేశం కూడా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన లయన్ ఆడియో ఆవిష్కరణలో బాలయ్య త్రిష పెదాలను పట్టుకునే సన్నివేశం ఈ రూమర్ కు మరింత బలం చేకూర్చేలా ఉంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఎమ్మెల్యే గా ఉండటం వలన అలాంటి సన్నివేశాలలో నటించరని కొందరు అనుకుంటున్నారు. రొమాంటిక్ సీన్స్ అయితే ఓకే కానీ... లిప్ లాక్ సన్నివేశాలలో నటించే అవకాశం లేదని భావిస్తున్నారు. మరి బాలయ్య త్రిష అదరాలు అందుకున్నాడో.. లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



