బాబీపై గుర్రుగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!
on Jul 7, 2017
ప్రజంట్ టాలీవుడ్లో ఉన్న హీరోల్లో ఎంత పెద్ద డైలాగ్ అయినా అనర్గళంగా చెప్పగల ఒన్ అండ్ ఓన్లీ హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్..అది పౌరాణికమైనా, ఇంగ్లీష్ డైలాగ్స్ అయినా ఎన్టీఆర్ రంగంలోకి దిగితే థియేటర్లో కేకలే..అయితే గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ నోటి వెంట సరైన మాటల తూటాలు పేలడం లేదు..జూనియర్ గత సినిమాలు టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాల్లో సాదాసీదా డైలాగ్స్ ఉండటతో నందమూరి అభిమానులు కాస్త డీలా పడ్డారు. అయితే బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్..తమ హీరో ఎలా ఉన్నాడో..ఎలాంటి డైలాగ్స్ పేలుస్తాడో అని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి షాక్ తగిలింది..చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ చివరిలో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెబుతాడు..అబ్బా అదిరిపోయింది అని సగటు అభిమాని అనుకుంటున్న టైంలో జూనియర్‌కు నత్తి అడ్డువస్తుంది. ఇదేంట్రా దేవుడా..? మా హీరో చేత పవర్ఫుల్ పంచ్‌లు వేయిస్తాడు అనుకుంటే ఇలా చేశాడేంటి అంటూ బాబీపై ఆగ్రహంతో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.