మహేష్ కు తండ్రిగా జగపతి
on Apr 21, 2014

ఇటీవలే "లెజెండ్" సినిమాతో విలన్ గా తనలోని మరో కోణాన్ని ప్రదర్శించిన నటుడు జగపతి బాబు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టవడంతో జగపతి మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం జగపతి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ఇటీవలే జగపతి మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కు తండ్రిగా జగపతిని ఎంపిక చేసారు. ఇప్పటివరకు "దూకుడు", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి చిత్రాల్లో మహేష్ కు తండ్రిగా నటుడు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. కానీ ఇటీవలే ప్రకాష్ రాజ్ ను టాలీవుడ్ దూరం పెట్టడంతో ఆ ఛాన్స్ జగపతిని వరించింది. ఈ చిత్ర షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మహేష్ సరసన ఓ కొత్త భామ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



