ఇలియానా ఏం మారలేదు సుమీ...!
on May 7, 2016

ఇలియానా.. బోల్డంత తేడా, కొంతం తిక్క ఉంటే.. కథానాయికల కెరీర్ ఎలా ఉంటుందో చెప్పడానికి తనకు తానే అతి పెద్ద నిదర్శనం. గత కొన్నేళ్లుగా.. ఇలియానా గురించి టాలీవుడ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలియానా కూడా టాలీవుడ్ సంగతి మర్చిపోయింది. ఇక మనల్ని ఎవ్వరూ పిలవరులే అని ఫిక్సయిపోయింది. సరిగ్గా అప్పుడే.. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో కథానాయికగా ఇలియానా ఛాన్సొచ్చినట్టు వార్తలొచ్చాయి. దర్శకుడు క్రిష్ ఇలియానాని కలిసి కథ గురించి చర్చించాడు. అయితే ఇలియానా మాత్రం ''ఇంత డెప్త్ ఉన్న పాత్ర అయితే నా వల్ల అవుతుందా. పైగా 'బాలయ్య బాబులాంటి సీనియర్ హీరో ముందు నెగ్గుకు రాగలనా'' అనే అనుమానాలూ వ్యక్తం చేసిందట.
అడిగిన వెంటనే ఒప్పేసుకొంటే అలుసైపోతానేమో, పారితోషికం తగ్గించేస్తారేమో.. అంటూ ఇలియానాలో కంగారు పట్టుకొందని, అందుకే బెట్టు చేస్తున్నట్టు నటిస్తోందని చెప్పుకొంటున్నారు. అయితే అదంతా నిజమే అని క్రిష్ నమ్మి.. ఇలియానాని లైట్ తీసుకొన్నాడట. ఇంకేముంది.. అలా చేతికందిన అవకాశం ఇలా చేజారిపోయింది. ఇలియానా మాత్రం ''నాకు బాలయ్య బాబు సినిమాలో నటించే ఆఫరేమీ రాలేదు'' అంటూ బుకాయిస్తుంది. ఏంటో ఈ గోవా పాప... ఎవ్వరికీ అర్థం కాదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



