హన్సికకి డబ్బు పిచ్చి పట్టిందా?
on Apr 23, 2015

హన్సిక కోలివుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. గత ఏడాది క్షణం తీరిక లేకుండా గడిపింది. కాస్త విశ్రాంతి కోసం ఓ మాంచి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసి తిరిగి ఇండియాకి వచ్చింది. అలా వచ్చిందో లేదో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయేందుకు షెడ్యూల్ తయారుచేసుకుంది. వరుసగా సినిమాలకు సంతకాలు చేసేసి సంవత్సరంపాటు తన డేట్లన్నీ పలు చిత్రాలకు కేటాయించేసింది. ఇదిలా ఉంటే హన్సిక డబ్బు కోసమే వెనుకా ముందూ ఆలోచించకుండా సినిమాలన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని కోలీవుడ్ లో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అసలే తనపై రూమర్లను సహించలేని ఈ అమ్మడు వెంటనే స్పదించి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక... కేవలం నటనపై తనకు ఉన్నఆసక్తి... ప్రేమే కారణం అని స్పష్టం చేసింది. డబ్బు మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని వివరించింది. మొత్తం మీద ఫుల్ బిజీ గా ఉన్న హన్సిక తన సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



