ఏంటి క్రిష్ ఇది...!
on Jan 3, 2017

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదలకు మరేంతో సమయం లేదు..ట్రైలర్ చూసిన దగ్గర నుంచి శాతకర్ణిపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత ఒక రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేసింది..ఇంత తక్కువ సమయంలో ఇంత గ్రాండ్ విజువల్స్ ఎలా సాధ్యమయ్యాయా అని..అంతేకాదు శాతకర్ణి సినిమా కోసం బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్‌ను, గ్రాఫిక్స్‌ను కాపీ కొట్టారని టాక్ వినిపించింది.
దీనిపై స్పందించిన డైరెక్టర్ క్రిష్ అలాంటిదేమి లేదని..ఈ సినిమాలోని వార్ సీన్స్ ఏ సినిమాలోంచి కాపీ కొట్టినవి కాదని ప్రకటించారు. కానీ క్రిష్ మాటల్లో వాస్తవం లేదని...గౌతమీపుత్ర శాతకర్ణిలో యుద్ధ సన్నివేశాలు బాజీరావ్ మస్తానీ నుంచి తీసుకున్నవేనని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. విజువల్స్ వాడుకునేందుకు ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి క్రిష్ ముందుగానే అనుమతి తీసుకున్నాడని..అందుకు గానూ బాజీరావ్ నిర్మాతలకు రూ.6 కోట్ల వరకు చెల్లించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే బాజీరావు నిర్మాతలు కానీ...శాతకర్ణి యూనిట్ కానీ నోరు విప్పాల్సిందే..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



