ఫ్రీగా చేస్తానన్నా పట్టించుకోరేం...?!
on Jun 10, 2016
కృష్ణవంశీ సినిమాలో నటించాలని కలలు కంది రెజీనా. ఒకవేళ క్రిష్ణవంశీ అవకాశం ఇస్తే ఫ్రీగా నటిస్తా.. అని ఆఫర్ ఇచ్చింది. ఆఖరికి బికీనీ వేయడానికి కూడా సిద్దపడింది. ఇన్ని త్యాగాలు చేసినా కృష్ణవంశీ దృష్టి.. రెజీనాపై పడడం లేదు. ఆయన ఇప్పుడు లావణ్య త్రిపాఠీపై దృష్టి సారించినట్టు టాక్. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నక్షత్రం. సందీప్ కిషన్ కథానాయకుడు. సుదీప్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. నందితను ఓ కథానాయికగా ఎంచుకొన్నారు. కాజల్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. మరో కథానాయిక పాత్ర కోసం కృష్ణవంశీ అన్వేషిస్తున్నారు. ఆ పాత్రకోసమే రెజీనా అప్లికేషన్ పెట్టుకొంది. అయితే ఇప్పుడు అది లావణ్య త్రిపాఠీని వరించబోతోందని టాక్. లావణ్య డేట్ల కోసం కృష్ణవంశీ ఆఫీసు నుంచి ఆరాలు మొదలయ్యాయట. ఒకవేళ లావణ్య అందుబాటులో ఉంటే.. ఆమెకే ఛాన్స్ అందే అవకాశం ఉంది. రెజీనానా ఫ్రీగా చేస్తాననన్నా బికినీ వేస్తానన్నా పట్టించుకోకుండా.. లావణ్య వైపు దృష్టి సారించడం రెజీనాకే కాదు, టాలీవుడ్‌కే షాకిచ్చే విషయం. మరి కృష్ణవంశీ మనసులో ఏముందో??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



