వాళ్లిద్దరిని చూస్తే చెర్రికి కుళ్లు..!
on Jan 4, 2017
.jpg)
సినీ పరిశ్రమలో తారల మధ్య పోటీ ఉండటం కామన్..అలాగే పైకి ఎంత కలివిడిగా ఉన్నప్పటికి ఒకరంటే ఒకరికి పడదు..ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు టాలీవుడ్‌లో ఇద్దరు హీరోలంటే చాలా అసూయట..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ధృవ సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో ఫుల్ జోష్‌లో ఉన్న చెర్రీ...ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు..దానిలో తనకు శర్వానంద్, నానిలంటే చాలా అసూయ అన్నాడు. శర్వానంద్, నాని కథలను ఎంపిక చేసుకునే విధానం నాకు ఈర్ష్యను కలిగిస్తుంటుంది. ఆ విషయంలో వాళ్లను చూసి కొన్నిసార్లు జెలసీగా ఫీలవుతా అని తన మనసులో మాట బయటపెట్టాడు. వీరిద్దరూ ఇలాంటి సినిమాలే చేస్తే వీరిని ఆపడం కష్టమని..ఆ తర్వాత వీరి దారిలో మిగతా హీరోలు నడవాల్సిందేనన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



