హరీష్ శంకర్‌పై బన్నీ గరమ్ గరమ్
on Mar 1, 2017
దర్శకుడు హరీష్ శంకర్‌పై అల్లు అర్జున్ గుర్రుగా ఉన్నాడా?? ఇద్దరి మధ్యా గ్యాప్ పెరుగుతోందా?? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దువ్వాడ జగన్నాథమ్ టీజర్ కట్ చేసిన విధానం అల్లు అర్జున్‌కి నచ్చలేదని, బన్నీ ఫైనల్ డిసిషన్ కోసం ఎదురుచూడకుండానే ఆ టీజర్‌ని అప్లోడ్ చేశారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. శివరాత్రి సందర్భంగా డీజే టీజర్ విడుదల అవ్వడం, ఏకంగా 50 లక్షల వ్యూస్ అందుకోవడం తెలిసిన విషయాలే. బన్నీ టీజర్‌కు వచ్చిన డిజ్ లైక్స్ కూడా... హాట్ టాపిక్‌గా మారాయి.
నిజానికి టీజర్‌ని కట్ చేసిన విధానం, చూపించిన షాట్స్.. వీటిపై బన్నీ సంతృప్తిగా లేడని తెలుస్తోంది. `మరో వెర్షన్ కట్ చేసి నాకు చూపించండి` అని చెప్పినా హరీష్ శంకర్ వినలేదట. దిల్‌రాజు కూడా బన్నీ ఫైనల్ డిసీషన్ కోసం ఎదురుచూడకుండా టీజర్‌ని ఎప్పుడు అప్ లోడ్ చేద్దామా అంటూ తొందరపడ్డాడని, ఈ టీజర్‌ని ఇన్ని హిట్స్ వచ్చినా.. `ఇంకాస్త మంచి అవుట్ పుట్ ఇవ్వాల్సింది` అనే భావన బన్నీలో ఉందని, తొందరపడి టీజర్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్ వ్యవహార శైలితో బన్నీ కాస్త అసంతృప్తిగా ఉన్నాడని టాక్. డీజే టీజర్‌కి డిజ్ లైక్స్ రావడం బన్నీ దృష్టికి వెళ్లిందని, ఈ విషయంపై కూడా అసహనంగా ఉన్నాడని, పవన్ ఫ్యాన్స్‌కి మరోసారి కౌంటర్ ఇవ్వడానికి బన్నీ రంగం సిద్దం చేసుకొంటున్నాడని, ఎప్పుడో ఒకప్పుడు బయటపడిపోవడం ఖాయమని మెగా కాంపౌండ్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.