ప్రభాస్ భారీ సినిమాలో అల్లు అర్జున్..!
on Jun 25, 2025
ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్ళడం సహజం. ఇటీవల టాలీవుడ్ లో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. 'పెద్ది' కథను బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు. కానీ, ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫిల్మ్.. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమా విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తోంది. ప్రభాస్ కోసం అనుకున్న ఓ కథ.. ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళినట్లు సమాచారం.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే సస్పెన్స్ నెలకొంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశముంది అంటున్నారు. దీనిని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడట.
నిజానికి ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'రావణం' అనే ఓ భారీ సినిమాను ప్లాన్ చేశాడు దిల్ రాజు. అయితే ప్రభాస్ చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తి కావాలంటే మరో నాలుగైదేళ్లు పడుతుంది. అందుకే దిల్ రాజు.. ఈ ప్రాజెక్ట్ ని బన్నీతో ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ లో విడుదల కానుంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్.. రావణం కోసం అల్లు అర్జున్ తో చేతులు కలిపే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
