షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చేసిన పనికి అందరూ షాక్!
on Jul 23, 2025

సినిమా అవుట్ పుట్ బాగా రావాలని కొందరు నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి వారికి తీవ్ర గాయాలు కూడా అవుతుంటాయి. తాజాగా 'డెకాయిట్' మూవీ షూటింగ్ లో హీరో హీరోయిన్లు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ గాయపడినట్లు తెలుస్తోంది.
2022లో 'మేజర్', 'హిట్-2' సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్.. ఏకంగా మూడేళ్ళ తర్వాత ఈ ఏడాది డిసెంబర్ లో 'డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ సినిమా కోసం శేష్, మృణాల్ ఎంతో కష్టపడుతున్నారు. ఇటీవల షూటింగ్ స్పాట్ లో చిన్న ప్రమాదం జరిగిందట. ప్రమాదవశాత్తూ కింద పది హీరో హీరోయిన్ కి గాయాలు అయ్యాయట. అయినప్పటికీ ఆ గాయాలతోనే ఇద్దరు షూటింగ్ పూర్తి చేశారని వినికిడి. సినిమా పట్ల శేష్, మృణాల్ ల డెడికేషన్ చూసి.. 'డెకాయిట్' టీం ప్రశంసించినట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



