పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి!
on Jan 18, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఉప్పెన' సినిమాలో 'రాయనం'గా నటించి మెప్పించిన విజయ్.. త్వరలో మరో పవర్ఫుల్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడని తెలుస్తోంది. 'భవదీయుడు భగత్ సింగ్'లో విలన్ పాత్రను హరీష్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట. ఈ పాత్రకి విజయ్ సేతుపతి అయితే కరెక్టుగా సరిపోతాడని భావించి, ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తే.. బిగ్ స్క్రీన్ పై పవర్ స్టార్ వర్సెస్ సేతుపతి పోరు ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



