గీతదాటిన త్రివిక్రమ్
on Jun 5, 2015
త్రివిక్రమ్ మొదటిసారిగా గీతదాటాడా? తన కోటరీలోంచి బయకొచ్చాడా? ఆముగ్గురి చుట్టూ ప్రదక్షిణలు చేసిచేసి విసుగొచ్చిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.....వరుసగా వీళ్ల ముగ్గురితో సినిమాలు తీసుకుంటూ పోయే త్రివిక్రమ్ పై చాలా విమర్శలున్నాయి. మరో హీరోవైపు చూడడా? లేదా మరో హీరోని హ్యాండిల్ చేసే దైర్యం లేదా? లేదా స్టార్ హీరోలతో తప్పితే ప్రయోగం చేయలేడా? అని చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి ఏమనుకున్నాడో ఏమో ఎట్టకేలకు గీతదాటేందుకు సిద్ధపడ్డాడట. లేటెస్ట్ గా యంగ్ టైగర్ పై కన్నేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం పవన్ తో కోబలి తీసే పనిలో ఉన్న త్రివిక్రమ్...ఎన్టీఆర్ తో ఓ మూవీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట. అటు ఎన్టీఆర్ కూడా సుకుమార్ తో బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ తో కొత్త చిత్రానికి ఆగస్ట్ లో కొబ్బరికాయ కొట్టేందుకు....వచ్చే సమ్మర్లో సినిమా విడుదలకు ప్లాన్ చేశాడట. ఇదే నిజమైతే సరైన హిట్ కోసం తపిస్తున్న ఎన్టీఆర్ కోరిక తీరినట్టే. ఏం జరుగుతుందో చూద్దాం!