క్రికెట్ బెట్టింగ్‌లో టాలీవుడ్ స్టార్??
on May 5, 2015
ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఫోర్లు, సిక్సర్లతో మైదానం హోరెత్తిపోతోంది. బయట కూడా జూదగాళ్లు విజృంభిస్తున్నారు. మ్యాచ్‌లపై కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. గల్లి నుంచి.. జూబ్లీహీల్స్ వరకూ.. బెట్టింగ్ ప్రేమికులు తమతమ స్థాయిలో పందాలు కాస్తున్నారు. ఈబెట్టింగ్ రాయుళ్లలో మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారని లేటెస్ట్ టాక్. ఓ బడా హీరో.. ఐపీఎల్ సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌పై లక్షలకు లక్షలు బెట్టింగులు కాస్తున్నాడని, మ్యాచ్‌ల పై దృష్టి పెట్టి... సినిమాకూడా పక్కన పెట్టేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనతో పాటు మరికొంతమంది హీరోలకూ బెట్టింగ్ రుచి చూపించాడట. సాయింత్రమైతే చాలు... ఆ హీరోగారి గెస్ట్ హోస్ బెట్టింగ్ రాయుళ్లతో నిండిపోతోందని టాక్. ఆ హీరో ఎవరనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్, అమ్మాయిలు, మందు.. ఇవన్నీ టాలీవుడ్‌లో ఉండేవే. ఇప్పుడు బెట్టింగ్ కూడా చేరిందన్నమాట. డబ్బులున్న చోటే కదా.. వ్యసనం రాజ్యమేలుతుంది..
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



