ఈ కథ ఎక్కడి నుంచి ఎత్తేశాడో..??
on Oct 29, 2014
.jpg)
హాలీవుడ్ సినిమాల్ని చూసి స్ఫూర్తి పొంది, తెలుగులో మాంఛి కమర్షియల్ సినిమాలు రాసుకోవడంలో మనవాళ్లు బాగా పండిపోయారు. ఎస్.ఎస్.రాజమౌళి విజయ సూత్రం ఇదే. కొత్తదర్శకులూ ఆయన బాటలోనే నడుస్తున్నారు. అన్నట్టు వంశీ పైడిపల్లిపై కూడా హాలీవుడ్ ప్రభావం చాలా ఉంది. ఎవడు సినిమా అక్కడి నుంచి తీసుకొచ్చిందే. ఫేస్ ఆఫ్ అనే హాలీవుడ్ కథని ఆయన చరణ్ ఇమేజ్‌కి తగ్గట్టు రూపొందించుకొన్నారు. ఇప్పుడు నాగార్జున - కార్తీలతో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందించే పనిలో ఉన్నారు. ఇది కూడా ఓ హాలీవుడ్ సినిమాకి స్ఫూర్తి అని ఇన్ సైడ్ టాక్. ఇన్ టచ్ బుల్స్ (2011) అనే హాలీవుడ్ సినిమాకి తెలుగు రూపం ఈ మల్టీస్టారర్ అంటున్నారు ఫిల్మ్‌నగర్ జనాలు. అందులో సీనియర్, జూనియర్ అనే రెండు పాత్రలుంటాయట. సీరియర్‌గా నాగ్, జూనియర్‌గా కార్తీ కనిపిస్తారని తెలుస్తోంది. సారం ఏదైనా సరే, రసవత్తరంగా తీర్చిదిద్దితే ఫర్లేదు. వంటకం తేడా కొట్టినా, కాపీ కథ అని తెలిసిపోయినా - సినిమా బోల్తా కొట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్త సుమీ...!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



