ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ విచారణ
on Apr 24, 2014

నటుడు ప్రకాష్ రాజ్ ను టాలీవుడ్ బహిష్కరించనుందనే వార్తలు గతకొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ నటిస్తున్న "ఆగడు" చిత్ర షూటింగ్ సమయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పట్ల దుర్భాషలాడి, అనుచితంగా ప్రవర్తించాడని తెలిసింది. అందుకే అతనిని ఈ సినిమా నుంచి తప్పించి ఆ స్థానంలో నటుడు సోనూసూద్ ను తీసుకున్నట్లు తెలిసింది. కానీ ప్రకాష్ రాజ్ ప్రవర్తించిన తీరుపై టాలీవుడ్ చాలా గరం గరంగా ఉందని తెలుస్తుంది. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఇటీవలే తెలుగు దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దాంతో దర్శకుల సంఘం బుధవారం రాత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రకాజ్ రాజ్ తీరుపై విచారణ చేపట్టింది. సభ్యుల అభిప్రాయాలను సేకరించింది. మే1న జరగబోయే సర్వసభ్య సమావేశంలో ప్రకాష్ రాజ్ పై ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్నయించనున్నట్లు తెలిసింది. ఒకవేళ ప్రకాష్ రాజ్ టాలీవుడ్ కి దూరమైతే.. టాలీవుడ్ పై ప్రకాష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



