కమల్ తో తేజ సినిమా చేస్తున్నాడా?
on Apr 23, 2014

"చిత్రం" సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తేజ ప్రస్తుతం వరుస పరాజయాలతో, అవకాశాలు లేక సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతున్నాడు అని అనుకునే సమయంలో మరో షాక్ ఇచ్చాడు. తెలుగులో గతకొద్దికాలంగా తేజ తీసిన అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇపుడు తేజతో సినిమా తీయాలంటే చాలా మంది హీరో, నిర్మాతలు భయపడుతున్నారు. కానీ కమల్ హసన్ ధైర్యం చేస్తున్నట్లు తెలిసింది.
తాజాగా కమల్ హాసన్ కు తేజ ఓ కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో తేజ బిజీగా ఉన్నాడు. కమల్ ప్రస్తుతం "విశ్వరూపం2" పూర్తి చేసుకొని, "ఉత్తమ విలన్" చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాల తర్వాత తేజ సినిమా ఉండబోతుందని సమాచారం.
మరి టాలీవుడ్ మొత్తం భయపడుతున్న తేజను కమల్ ఎలా నమ్మాడు? తేజ చెప్పిన కథ ఏంటి? కమల్ ను తేజ ఎలా ఒప్పించాడు? అనే చర్చలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



