ఎన్టీఆర్ సినిమాపై సుకుమార్ క్లారిటీ
on Jan 12, 2015
ఎన్టీఆర్ తో సుకుమార్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే కదా. అయితే, ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ లోనే ఉన్నట్లు సుకుమార్ ప్రకటించాడు. ఈ సినిమా ఒక తండ్రీ కొడుకుల కథ. అంటే సెంటిమెంటు పాళ్లు కూడా ఉంటాయన్నమాట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని స్వయంగా సుకుమార్ చెప్పేశాడు. అత్తారింటికి దారేది సినిమా తీసిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఎన్టీఆర్ టెంపర్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలవుతుందట.