అఖిల్ కి జోడిగా శ్రీదేవి కూతురు..!
on Nov 21, 2014

అక్కినేని అఖిల్ రంగప్రవేశం కోసం ఆ కుటుంబం అభిమానులే కాదు.. దాదాపు తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. 'మనం' చిత్రంలో జస్ట్ 30 సెకన్లు కనిపించి, మంచి మార్కులు కొట్టేశాడు అఖిల్. ఇక హీరోగా ఎంటర్ కావడమే ఆలస్యం. అఖిల్ నటించబోయే తొలి చిత్రానికి వీవీ వినాయక్ దర్శశకత్వం వహిస్తాడనే వార్త ప్రచారంలోం ఉంది. చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తరహాలో సాగే సోషియో ఫాంటసీ చిత్రం ఇదని తెలుస్తోంది.ఈ చిత్రంలో అఖిల్ సరసన బోనీకపూర్, శ్రీదేవిల ముద్దుల కూతురు జాన్విని కథానాయికగా నటింపజేయడానికి నాగార్జున గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. శ్రీదేవితో నాగ్ చర్చలు కూడా జరిపారని సమాచారమ్. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని నాగ్ కి శ్రీదేవి మాటిచ్చిందని వినికిడి. 'జోష్' ద్వారా రాధ తనయ కార్తీకను టాలీవుడ్ కి తీసుకువచ్చారు నాగ్. ఇప్పుడు తన రెండో కొడుకు అఖిల్ చిత్రం ద్వారా శ్రీదేవి కూతురిని టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం చేసిన ఘనత నాగ్ కే దక్కుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



