నేను పెళ్లికి రెఢీ!
on Jul 7, 2015
.jpg)
జనవరి మాసం ఇది మంచుకురిసే సమయం అంటూ చెలరేగిపోయిన సోనియా అగర్వాల్ మళ్లీ పెళ్లికి రెఢీ అంటోందట. 7/G బృందావన కాలనీతో హిట్టుకొట్టిన సోనియా ఆ చిత్రం దర్శకుడైన సెల్వ రాఘవన్ ని పెళ్లిచేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయింది.
కాస్త విరామం తర్వాత సెల్వరాఘవన్ ఎంచక్కా మళ్లీ పెళ్లిచేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో పౌరుషం వచ్చిన సోనియా కూడా పెళ్లికి సిద్ధం అంటోంది. ఈ మధ్యే టెంపర్లో డాక్టర్ గా కనిపించి ఆకట్టుకున్న ఈ ఆంటీకి తెలుగులో ఆఫర్లు బాగానే వస్తున్నాయట.
తల్లి, అత్తగా మెప్పిస్తానని దర్శకనిర్మాతలకు సందేశం పంపిస్తోంది. ఆఫర్ల సంగతి సరే పెళ్లి విషయంలో ఈసారైనా కాస్త ఆచితూచి అడుగేయమ్మా అని సలహా ఇస్తున్నారు. అది సరే కానీ ఇంతకీ అమ్మడి హాట్ హాట్ అందాల్ని ఒడిసిపట్టే ధైర్యం ఎవరో చేస్తారో ఏంటో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



