హీరోగా సింగర్ సునీత కుమారుడు.. నిర్మాత ఎవరో తెలుసా?
on Jan 31, 2022

టాలీవుడ్ కి మరో వారసుడు హీరోగా పరిచయం కానున్నాడని తెలుస్తోంది. ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి సునీత భర్త రామ్ వీరపనేని నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.
వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని సునీత గతేడాది రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే ఆమెకు మొదటి వివాహ సంతానంగా కుమారుడు ఆకాష్, కూతురు శ్రేయా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆకాష్ ని హీరోగా పరిచయం చేసేందుకు ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చదువు పూర్తి చేసిన ఆకాష్ ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.
సునీతకి, రామ్ కి ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో ఆకాష్ ని గ్రాండ్ గా లాంఛ్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాకి రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని.. ప్రస్తుతం కథ, దర్శకుడి అన్వేషణలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆకాష్ లాంఛ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



