చిక్కడుదొరకడు సిద్దుతో చిక్కిన సమంత
on Jul 19, 2014

సౌత్ పరిశ్రమలో హాట్ కపుల్ అంటూ చెలామణిలో వున్న సిద్ధార్థ, సమంత వారి ప్రేమ గురించి బయటకు బాహాటంగా ఎక్కడా చెప్పకపోయినా ఇండస్ట్రీలో మాత్రం వీరి వ్యవహారం గురించి చర్చ సాగుతూనే వుంది. చిక్కడు దొరకడు ఆడియో ఫంక్షన్ లో సిద్దూ మాటలు వింటే వీరి వ్యవహారం నిజమే అని నమ్మటంలో తప్పులేదనిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు, ఈ ఆడియో ఫంక్షన్లో తన సినిమాకు సంబంధం లేకున్నా సమంత గురించి సిద్దార్థ మాట్లడటమే ఈ అనుమానాలకు మరింత ఊతం ఇస్తుంది.
చిక్కడు దొరకడు సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతూ, ఇక్కడ సమంత లాగే అక్కడ లక్ష్మీ మీనన్ చాలా క్రేజ్ వున్న హీరోయిన్ అని పొగుడుతూ వచ్చాడు. ఫంక్షన్లో అప్పటివరకూ ఉన్న వాతావరణం, సమంత పేరు వినగానే మారిపోయిందని చెప్పాలి. సిద్ధార్థ సమంత గురించి మరిన్ని విషయాలు చెప్తాడని ఆశగా చూశారు అక్కడున్న వారంతా. ఇప్పటికి సమంత గురించి ఇంతకన్నా ఎక్కువ వద్దనుకున్నాడేమో అక్కడితో ఆపేశాడు. అలా సమంత విషయంలో చిక్కినట్లే చిక్కి తెలివిగా తప్పుకున్నాడు సిద్ధార్థ...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



