సమంత న్యూ లవర్ సిద్ధూ లవ్‌ఫేల్యూర్
on Jul 7, 2014

దక్షిణాదిలో ఓపెన్ గా ప్రేమించుకుంటూ కనిపించే తారలు తక్కువే. ప్రభుదేవా, శింభూ, నయనతార ఇలా పబ్లిక్ లో ప్రేమికులుగా కనిపించిన వారి పేర్లు వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సౌత్ లో పాపులర్ పెయిర్ సమంత, సిద్ధార్థ. వీరి పేరు చాలా కాలంగా మీడియాలో వినిపిస్తు వుంది. కాళహస్తిలో పూజలు, పార్టీలు ఇలా చాలా సందర్భాల్లో వీరు కలిసి మీడయాకు చిక్కారు. అయితే గత సంవత్సర కాలం నుంచి సమంత చాలా బిజీ హీరోయిన్. అంతే కాదు టాప్ హీరోయిన్ అని చెప్పుకుంటున్నారు.
దీంతో సిద్దూతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీకి సమంత దగ్గర అస్సలు సమయం లేదట. తమిళ, తెలుగు చిత్ర సీమల్లో వరుస హిట్లు, అవకాశాలతో పరిచయాలు కూడా భారీగా పెరిగాయట. సిద్దూ కాల్ చేసినా సమంత హలో అనలేనంత బిజీగా మారిపోయిందట. అంతే కాదు ఎవరో ఎన్‌ఆరైతో ఈ మధ్య ఎక్కువ సమయం కూడా గడుపుతోందట. ఇవన్నీ అటుంచి పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చిన సిద్దూతో తాను అందుకు సిద్ధంగా లేనని కూడా చెప్పిందట. ఇక అనగనగా ఓ ధీరుడు సిద్ధూ లవ్ ఫేల్యూర్ అయినట్లే అని అనుకుంటున్నారు సినీ వర్గాల్లో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



