తారక్ నెక్స్ట్ మూవీకి రూ.200 కోట్లు!!
on Jul 17, 2021

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా రానున్న ఈ చిత్రం.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత తారక్-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఎదిగాడో.. తారక్, చరణ్ కూడా 'ఆర్ఆర్ఆర్' తరువాత అలా మారే అవకాశముంది. దీంతో తారక్, చరణ్ ల తదుపది సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న కొత్త చిత్రం బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అంటున్నారు. అలాగే తారక్-కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రానికి కూడా దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి 'ఆర్ఆర్ఆర్' తరువాత తారక్, చరణ్ ల క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



