రవితేజ ‘పవర్’ మళ్లీ వెనక్కి..!
on Aug 25, 2014
.jpg)
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘పవర్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాను ఆగస్ట్ 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సెప్టెంబర్ 5 కి వెళ్లింది. ఇప్పుడు మళ్ళీ మరోరెండు వారాలు ఈ సినిమా వెనక్కి వెళ్ళిందంటూ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇంతకీ ఈ సడన్ వాయిదా కారణం ఏమిటని ఆరా తీయగా దీని వెనుక దిల్ రాజూ హస్తం వున్నట్లు సమాచారం. ప్రస్తుతం దిల్ రాజూ ఎన్టీఆర రభస, రవితేజ పవర్ సినిమాల నైజాం రైట్స్‌ని తీసుకున్నారు. రభస సినిమా ప్రీ రిలీజ్ టాక్ మంచిగా వుండడంతో ‘పవర్’ని వాయిదా వేయాలని నిర్మాతను రిక్వెస్ట్ చేసినట్లు టాక్. ఎన్టీఆర్ సినిమాకి హిట్ టాక్ వస్తే... పవర్ కి థియేటర్ల సమస్యలు ఏర్పడతాయడని చెప్పాడట. దీంతో ‘పవర్’ నిర్మాత వాయిదా ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



