రణబీర్ పెళ్లి కత్రినాతో కాదా?
on May 14, 2015
.jpg)
బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ పెళ్లి విషయంపై బీ టౌన్లో రచ్చ జరగుతోంది. మాజీ ప్రేయసి దీపికా పదుకొనే పెద్ద బాంబ్ పేల్చింది. అమ్మడి కామెంట్ తో వ్యవహరం మళ్లీ మొదటికొచ్చిందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. యే జవాని హై దివానీ షూటింగ్ సమయంలో డేటింగ్ లో మునిగి తేలిన రణబీర్-దీపిక ఆ తర్వాక కటీఫ్ చేప్పేసుకున్నారు. వెంటనే కత్రీనా కైఫ్ ను లైన్లో పెట్టాడు రణబీర్. పార్కులు, బీచ్ లు, షికార్లు, పార్టీలు ఒకటా రెండా పిచ్చిపిచ్చిగా తిరిగేశారు. త్వరలోనే పెళ్లన్నారు. ఇంతలో తమాషా సినిమాలో రణబీర్ తో నటిస్తున్న దీపిక...రణబీర్ సో స్వీట్ అంది. దీంతో షాక్ తిన్న సినీ ప్రియులు రణబీర్ ఎవర్ని పెళ్లిచేసుకోబోతున్నాడనే డైలమాలో పడ్డారు. అటు కత్రినా ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచించలేదంటోంది. రణబీర్ ఈనెల్లోనే నిశ్చితార్థం అంటున్నాడు. మా రిలేషన్ అబ్బో సూపర్ అంటోంది దీపిక. దీంతో ఎవరు ఎవర్ని పెళ్లిచేసుకుంటారనేది క్లారిటీ లేదు. ఫైనల్ గా రణబీర్ తో ఏడడుగులేసే భామ ఎవరో ఏంటో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



