గోపీచంద్ మూవీలో విలన్ గా రాజశేఖర్!!
on Aug 6, 2021

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్స్ తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో రాజశేఖర్ విలన్ గా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ లో పలువురు సీనియర్ హీరోలు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారుతున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలు విలన్ గా మారి అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో రాజశేఖర్ కూడా చేరుతున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్నో పవర్ ఫుల్ రోల్స్ పోషించి యాంగ్రీ హీరోగా పేరు తెచ్చుకున్న రాజశేఖర్.. కొంతకాలంగా హీరోగా వెనకబడ్డారనే చెప్పాలి. దీంతో ఆయన విలన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. శ్రీవాస్ తాజాగా గోపీచంద్ మూవీలో విలన్ పాత్ర కోసం రాజశేఖర్ తో సంప్రదింపులు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. విలన్ గా నటించడానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొస్తున్నాయి.
రాజశేఖర్ హీరోగా ప్రస్తుతం 'మర్మాణువు' అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



