అప్పుడే ఓటీటీకి 'రాధేశ్యామ్'!
on Mar 14, 2022
.webp)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'రాధేశ్యామ్' మూవీ శుక్రవారం(మార్చి 11 న) థియేటర్స్ లో విడుదలైంది. డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ మూవీ మంచి కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 72 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీ విడుదల కానుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే న్యూస్ వినిపిస్తోంది.
'రాధేశ్యామ్' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం సినిమా థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. ఆ లెక్కన ఏప్రిల్ 10 లేదా 11 తేదీ నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ సన్నాహాలు చేస్తోందట. మరోవైపు ఉగాది కానుకగా ఏప్రిల్ 2 నుంచి కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.
ఇటీవల 'పుష్ప ది రైజ్' కూడా నెల రోజుల లోపే ఓటీటీలో విడుదలైంది. డిసెంబర్ 17 న థియేటర్స్ లో విడుదలైన పుష్ప.. జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలోనూ అదే జరగనుందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



