'పైసా వసూల్' కాంబినేషన్ మరోసారి!!
on Jul 20, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'పైసా వసూల్'. ఇందులో కొత్త బాలయ్యని చూపించాడు పూరి. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో బాలయ్య ఫ్యాన్స్ ని మెప్పించాడు. అందుకే సినిమా ఆశించినస్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా.. బాలయ్య-పూరి కాంబినేషన్ లో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే త్వరలోనే వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలుస్తోంది.
బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేస్తున్నాడు. సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'అఖండ'పై భారీ అంచనాలే ఉన్నాయి. అనంతరం ఇటీవల రవితేజకి 'క్రాక్'తో సూపర్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. బాలయ్య-పూరి కాంబినేషన్ లో సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి పండగనే చెప్పాలి.
కాగా పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
