సినిమాలకు గుడ్ బై చెప్పిన నయనతార!
on Jun 8, 2022
.webp)
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్ళాడుతున్న సంగతి తెలిసిందే. రేపు(జూన్ 9 న) మహాబలిపురంలో వీరి పెళ్లి జరగనుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నయన్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వనుందని టాక్.
గతంలో నయన్ ప్రభుదేవాను ప్రేమించింది. పెళ్లి పీటలు వరకు వచ్చిన వీరి పెళ్లి అనూహ్యంగా ఆగిపోయింది. అయితే ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నయన్ అప్పట్లో శ్రీరామరాజ్యం(2011) సినిమా తన చివరి సినిమా అని ప్రకటించింది. ఆ నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేయగా.. అంతకంటే పెద్ద షాక్ ఇస్తూ వారి పెళ్లి ఆగిపోయింది.
ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయన్ వరుస సినిమాలతో అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. ఈ క్రమంలోనే విఘ్నేష్ తో ప్రేమలో పడిన నయన్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతోంది. అయితే ఆమె ఇప్పుడు కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోందట. ప్రస్తుతం తను అంగీకరించిన సినిమాలు పూర్తి చేసి, ఇక కొత్త ప్రాజెక్ట్ లేవీ ఒప్పుకోకూడదని నిర్ణయించుకుందట. ఇప్పటికే విఘ్నేష్ తో పాటు కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని చెప్పిందని, ఇక నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనని ప్రచారం జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



