'SSMB28'లో నేచురల్ స్టార్ నాని!
on May 19, 2022
రీసెంట్ గా 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న మహేష్ 28వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
2020లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నాడు. ఈ గ్యాప్ లో 'SSMB28' స్క్రిప్ట్ పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని, దానికోసం ఓ హీరోని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ప్రముఖంగా నేచురల్ స్టార్ నాని పేరు వినిపిస్తోంది. తాను మహేష్ ఫ్యాన్ అని నాని గతంలో అనేకసార్లు చెప్పాడు. తన అభిమాన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశమొస్తే నాని ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశముంది. ఒకవేళ ఏదైనా కారణం చేత నాని ఈ రోల్ చేయలేకపోతే.. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ని సంప్రదించే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు టాక్.
త్రివిక్రమ్ గత చిత్రం 'అల వైకుంఠపురములో' అల్లు అర్జున్ హీరో కాగా.. సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. అయితే ఇది అలాంటి పాత్ర కాదని, చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. మరి ఈ పాత్రలో నాని సందడి చేస్తాడో లేదో చూడాలి.