ఆమె నిర్ణయం మెగా హీరోలకు నచ్చలేదు
on Nov 4, 2015
.jpg)
నాగబాబు కుమార్తె నిహారిక కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె తొలి సినిమా ముహూర్తం జరుపుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే.. ఆమెకు మెగా హీరోల సపోర్ట్ ఉంటుందా, లేదా? అనేది అనుమానంగా మారింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, బన్నీలకు నిహారిక ఎంట్రీ నచ్చలేదని తెలుస్తోంది. నాగబాబుకి చిరంజీవి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు సమాచారం. కానీ.. నాగబాబు చిరు మాట వినలేదట.
మరోవైపు రామ్‌చరణ్ కూడా బాబాయ్ పై ఈ విషయంలో సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. `కావాలంటే టీవీ పోగ్రామ్స్ చేసుకోవచ్చుకదా` అని చెప్పాడట. పవన్ కల్యాణ్ మాత్రం.. తటస్థంగా ఉండిపోయాడట. సపోర్ట్ చేస్తాననిగానీ, చేయనని గానీ ఏదీ చెప్పలేదట. నిహారికకు తన తొలి సినిమా ఓపెనింగ్ గ్రాండ్‌గా జరగాలిని, ఆ కార్యక్రమానికి మెగా హీరోలంతా వచ్చి తనని ఆశీర్వదించాలని కోరుకొందట.
అయితే.. ఈ కార్యక్రమానికి మెగా హీరోలెవ్వరూ హాజరు కావడం లేదని తెలుస్తోంది. దాన్ని బట్టి... నిహారిక ఎంట్రీ మెగా హీరోలెవ్వరికీ ఇష్టం లేదన్న సంగతి స్పష్టమవుతోంది. అందుకే.. ఈ సినిమా ఓపెనింగ్ గప్ చుప్ గా చేసేయాలని.. చిత్రబృందం డిసైడ్ అయ్యిందట. మరి మెగా హీరోల్ని కాదని నిహారిక ఎదుగుతుందా? ఆమెకు అభిమానుల సపోర్ట్ ఉంటుందా?? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



