నాన్నకు ప్రేమతో..ఎన్టీఆర్
on Apr 6, 2015
.jpg)
మాస్ టైటిల్ తో అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి తన రూట్ ను మార్చినట్టు సమాచారం. సుకుమార్ తో తాను చేయబోయే సినిమాకు క్లాస్ టైటిల్ పెట్టాలనే ఆలోచనలో వున్నాడట. ఈ సినిమాలో తన లుక్ దగ్గర నుంచి టైటిల్ వరకు అన్ని డిఫరెంట్ గా వుండేలా ప్లాన్ చేయాలని సుకుమార్ ను ఆదేశించాడట. దీంతో సుక్కు తన రైటర్స్ టీమ్ తో డిస్కషన్ చేసి..‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ఎన్టీఆర్ కు సూచించడట. ఈ టైటిల్ ఎన్టీఆర్ కు తెగ నచ్చేయడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఎన్టీఆర్ వంటి మాస్ హీరో... ఇలా సెంటిమెంట్ తో కూడిన సాఫ్ట్ టైటిల్ ఓకే చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ గానే వుంటుందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



