బాబాయికి ప్రేమతో...అబ్బాయికి దూరంతో..!!
on Jan 11, 2016
నందమూరి కుటుంబంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య వారసత్వ రగడ తలెత్తిందంటూ సినీ వర్గాలలో ప్రచారం సాగుతున్న విషయం విషయం తెలిసిందే. ఈ టైమ్ లో బాలయ్య నటించిన 'డిక్టేటర్', జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' పోటీ పడుతుండడంతో నందమూరి అభిమానుల మధ్య చీలిక ఏర్పడింది. సోషల్ మీడియాలో వీరి మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. 'బాబాయ్‌తో నాకు విభేదాల్లేవు.. వున్నాయని నేను చెప్పలేదు.. బాబాయ్ కూడా చెప్పలేదు.. సంక్రాంతికి రాబోతున్న బాబాయి సినిమా కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి' ఈ రగడకు చెక్ పెట్టె ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్. అలాగే 'స్వర్గీయ ఎన్టీఆర్‌కి నేను వారసుడ్ని కాను.. మనవడిని మాత్రమే' అని చెప్పి తన వినమ్రతను చాటుకున్నాడు.
ఇంకోపక్క బాలయ్య వైపు మాత్ర౦ పాజిటివ్ స్పందన రావడం లేదు. ''నాకు మరెవ్వరూ పోటీ కాదు. నేను బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటా..స్వర్గీయ ఎన్టీఆర్‌కి నేనే వారసుడ్ని.. నా వారసత్వంగా నా కొడుకు - ఆ తర్వాత మనవడు వస్తారేమో వాళ్లు నాకు పోటీగా నిలుస్తారేమో’’ అని బాలయ్య అన్నాడు. ఒకపక్క ఎన్టీఆర్ బాబాయి మీద ప్రేమతో దగ్గరవ్వాలని చూస్తుంటే..బాబాయి మాత్రం అబ్బాయిని దూరంగా పెట్టాలని భావిస్తున్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.