'ముకుంద' సంక్రాంతికి వస్తున్నాడట
on Nov 17, 2014
.jpg)
మెగా ఫ్యామిలీ కొత్త హీరో వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద' సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఆడియో డిసెంబర్ 14న విడుదల చేసి సంక్రాంతి సీజన్‌లో సినిమాని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ పాటను హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక సెట్ లో చిత్రీకరిస్తారట. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ సినిమాకి మిక్కి జె.మేయర్ సంగీతాన్నందిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వు లేని జీవితం' నిన్ననే విడుదలై మంచి టాక్ తో నడుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



