మహేష్ 'బ్రహ్మోత్సవం' షూటింగ్ అప్ డేట్స్
on Sep 18, 2015
.jpg)
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకి సంబంధించిన సంగీత్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. మహేష్‌బాబు, ప్రణీత, నరేష్, రావు రమేష్, జయసుధ, తులసి... ఇలా 21 మంది నటీనటులపై ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను బ్రేక్ ఇవ్వకుండానే కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. సంక్రాంతి నాటికి థియేటర్లలోకి తేవాలనే పట్టుదలతో ఉన్నాడు మహేష్. ప్రిన్స్ సరసన ఈ సినిమాలో ముగ్గురు నాయికలుగా సమంత, కాజల్, ప్రణీతలు కనిపించబోతుండగా.. స్పెషల్ సాంగ్ లో మరో క్రేజీ హీరోయిన్ ని ట్రై చేస్తున్నారు. పివిపి బ్యానర్ పై రూపొందుతున్న బ్రహ్మోత్సవాన్ని.. తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్ చేయబోతుండడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



