జయసుధను బెదిరించారట
on Mar 25, 2015

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. కొన్ని రోజుల ముందు వరకు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడవడం లాంఛనమే అన్నారు కానీ.. ఉన్నట్లుండి జయసుధ సీన్లోకి వచ్చి దూసుకెళ్తున్నారు. మా అధ్యక్షుడి ఎన్నిక విషయంలో టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోగా.. ముందు రాజేంద్రప్రసాద్ వైపు ఉన్నవాళ్లంతా కూడా జయసుధ పక్కకు మళ్లుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవిని ఖాళీ చేస్తున్న మురళీమోహన్ మద్దతు జయసుధకు కీలకంగా మారింది. ఆయన తన మద్దతుదారులందరినీ కూడగట్టి జయసుధ వెంట నడిపిస్తున్నారు.
జయసుధ.. మురళీమోహన్‌తో పాటు మరో సీనియర్ నటుడు కృష్ణంరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి.. తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల కన్నా అనుభవం ఉందని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే ఈ పదవి చేపడదామని అనుకున్నానని.. కానీ కొన్ని మాటలు విన్నాక పోటీలో నిల్చోక తప్పలేదని జయసుధ అన్నారు. ప్రత్యర్థులు కొంతమంది నన్ను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారని అన్నారు.మొత్తానికి మా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం ఎన్నికలు జరగబోతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



