బన్నీ చెర్రీలతో మహేష్ లవర్
on Apr 16, 2014

మహేష్ తో కలిసి "1నేనొక్కడినే" చిత్రంలో నటించిన బ్యూటీ కృతిసనన్ కు ఇప్పటివరకు మరో సినిమాలో ఒక్క అవకాశం కూడా రాలేదు. ఈ సినిమా విడుదలై కృతికి మంచి పేరునే తెచ్చిపెట్టింది.అయితే తాజాగా ఈ అమ్మడికి రెండు భారీ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు తెలిసింది.
"జులాయి" తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. రెండవ హీరోయిన్ గా మొన్నటివరకు ప్రణీతను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కృతి సనన్ ను తీసుకున్నట్లు తెలిసింది. అలాగే రాంచరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కృతిసనన్ హీరోయిన్ గా తీసుకున్నారని తెలిసింది.
అసలే "1నేనొక్కడినే" చిత్రం తర్వాత అవకాశాలు రాక ఎదురుచూపులు చూస్తున్న ఈ అమ్మడికి ఈ రెండు భారీ మెగా ఆఫర్లు దక్కితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉందో త్వరలోనే తెలియనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



