BB3.. బ్యాడీగా శరత్ కుమార్?
on Apr 1, 2021
మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందించే చిత్రాల్లో కథానాయకుల పాత్రలు ఎంత శక్తిమంతంగా ఉంటాయో.. ప్రతినాయకుల పాత్రలు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే.. బోయపాటి చిత్రాల్లో విలన్ రోల్స్ పోషించే నటులకు కూడా మంచి పేరు వస్తుంది. ఈ నేపథ్యంలోనే.. నటసింహ నందమూరి బాలకృష్ణతో బోయపాటి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ `BB3`లో విలన్ ఎవరై ఉంటారా? అన్నదానిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓ విలన్ గా సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తుండగా.. మెయిన్ విలన్ ఎవరన్నదానిపై క్లారిటీ రాలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో సీనియర్ నటుడు శరత్ కుమార్ బ్యాడీగా కనిపించనున్నాడట. ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోయే నటుడిగా పేరు తెచ్చుకున్న శరత్ కుమార్.. ఇప్పటికే బోయపాటి రూపొందించిన `జయ జానకి నాయక`లో ఓ కీలక పాత్రలో నటించాడు. త్వరలోనే `BB3`లో శరత్ కుమార్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
`BB3`లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ యాక్షన్ డ్రామా జనం ముందుకు రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
