బీ టౌన్ భామలపై కంగనా హాట్ కామెంట్స్!
on Jun 16, 2015

బాలీవుడ్ ముద్దుగుమ్మలకు హిందీ కూడా సరిగ్గా మాట్లాడడం రాదు...ఏదో నెట్టుకొస్తున్నారంతే. ఇంత హాట్ కామెంట్ చేసిందెవరు అని షాక్ తిన్నారా? బాలీవుడ్ లో అంత ధైర్యం కంగనా రనౌత్ కు తప్ప ఇంకెవరికి ఉంది చెప్పండి! బాలీవుడ్ భామలందు తాను వేరయా అన్నట్టుండే కంగనా..ఉన్నది ఉన్నట్టు మాట్లాడేందుకు అస్సలు జంకదు.
క్వీన్ తో బాలీవుడ్ క్వీన్ గా మారిన బ్యూటీ ప్రస్తుతం మాంచి జోరుమీదుందన్న సంగతి తెలిసిందే. ఆ విషయం సరే ఇంతకీ రియల్ లైఫ్ సంగతేంటమ్మా అంటే...ప్రేమా గీమా జాన్తానై అని సింపుల్ గా చెప్పేసింది. పైగా పెళ్లి ప్రస్తావన కూడా తీసుకురావద్దంటోంది. ఇప్పుడిప్పుడే అవార్డు, అవకాశాలొస్తున్నాయని, డిస్ట్రబ్ చేయకండంటూ విసుక్కుంటోందట. అంతటితో ఆగకుండా.... అమ్మడి నటనపై పెద్దల ప్రసంశలు ఎక్కువవడంతో తోటి ముద్దుగుమ్మలంతా చిన్నగా కనిపిస్తున్నట్టున్నారు.
ఇప్పటికీ చాలామంది బాలీవుడ్ తారలకు సరిగా హిందీ కూడా మాట్లాడటం రాదు....గ్లామర్ చూపించి ఛాన్సులు దక్కించుకుంటున్నారంతే అని స్టేట్ మెంట్స్ ఇచ్చింది. దీంతో కంగనా అతిగా వ్యవహరిస్తోందంటూ బీటౌన్ భామలు రుసరుసలాడుతున్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే బెటరంటున్నారు. మరి కంగనా ఏమంటుందో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



