సంచలన దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా.. త్వరలోనే బిగ్ సర్ ప్రైజ్...
on Nov 9, 2024

ఇటీవల 'దేవర'తో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ప్రస్తుతం 'వార్-2' షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ చేతిలో.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు, 'దేవర-2' లైన్ లో ఉన్నాయి. వీటి తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేసే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు నిజమేనని, ఎన్టీఆర్-నెల్సన్ కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయిందని, త్వరలోనే ప్రకటన రానుందని సమాచారం.
తక్కువ సినిమాలతోనే కోలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్. ముఖ్యంగా గతేడాది రజినీకాంత్ తో చేసిన 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం 'జైలర్-2' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, నెల్సన్ చెప్పిన కథ ఎన్టీఆర్ కి నచ్చిందని వినికిడి. ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



