జాన్ అబ్రహం ఉరఫ్ సమరసింహారెడ్డి !!!
on Jul 11, 2014

అవును.. ఇప్పుడు మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ హిట్ అయిన పోకిరీ, నువ్వుస్తానంటే నేనొద్దాంటానా, విక్రమార్కుడు చిత్రాలు బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే బాలీవుడ్ టాలీవుడ్ హిట్ చిత్రాలను రీమేక్ చేసెందుకు ఏ మాత్రం ఆలోచించట్లేదు. గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలను తిరగదోడి మరీ రైట్స్ కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కెరీర్నే మలుపుతిప్పిన సమరసింహారెడ్డి చిత్రం రీమేక్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయని వార్తలు వెలువడుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ ఈ రైట్స్ కోటి రూపాయలకు ఈ రైట్స్ కొన్నదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాన్ అబ్రహం హీరోగా చెయ్యబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.
నిజానికి టాలీవుడ్ స్టోరీ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ జాన్ అబ్రహం అడగ్గా ఒక కథను తయారు చేసి అందించారట. దీనిని టాలీవుడ్ మీడియా తనదైన రీతిలో మలిచి వార్తలుగా మలుస్తోంది. ఈ విషయంలో విజయేంద్ర ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. తాను జాన్ అబ్రహంకు అందించిన కథ సమరసింహా రెడ్డి చిత్ర కథ కాదు అని, అసలు ఏ తెలుగు సినిమా కాదని ఆయన స్పష్టం చేశారు. మగధీర, విక్రమార్కుడు, ఛత్రపతి వంటి సూపర్ హిట్ చిత్రాల కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ నుంచి ఆఫర్ లు అందడం ఏ మాత్రం ఆశ్చర్యపరిచే విషయం కాదు. హిట్ అందించే సెంటిమెంట్, సత్తా ఉందంటే సినీ పరిశ్రమ వెతుక్కుంటూ ఎంత దూరమైనా వెళ్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



