షాకింగ్.. రాజమౌళి లాస్ట్ మూవీ వారణాసి..!
on Dec 21, 2025

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో 'వారణాసి'(Varanasi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చే చివరి సినిమా 'వారణాసి'నే అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. 'వారణాసి' తర్వాత ఆయన మహాభారతం ప్రాజెక్ట్ పై వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిని సినిమాలా కాకుండా సిరీస్ లా చేసే ఆలోచనలో ఉన్నారట. 'గేమ్ ఆఫ్ త్రోన్స్' తరహాలో వివిధ దేశాల ప్రేక్షకులకు చేరువయ్యేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందించాలని చూస్తున్నారట. (Mahabharata)
మహాభారతం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. పలు సీజన్లుగా తెరకెక్కించవచ్చు. ఒక్కో సీజన్ కి రెండు మూడేళ్లు పడుతుంది. ఈ లెక్కన అన్ని సీజన్లకు కలిపి కనీసం పది, పదిహేనేళ్ళు పట్టే అవకాశముంది. అందుకే 'వారణాసి' తర్వాత ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజమౌళి తన ఫోకస్ ని మహాభారత్ ప్రాజెక్ట్ పై పెట్టనున్నారని న్యూస్ వినిపిస్తోంది.
Also Read: ఎన్టీఆర్ సినిమాలో రజనీకాంత్.. స్క్రీన్స్ తగలబడతాయి!
అయితే ఇండస్ట్రీ సర్కిల్స్ మరో మాట కూడా వినిపిస్తోంది. 'వారణాసి' తర్వాత ఎన్టీఆర్ తో రాజమౌళి ఒక సినిమా చేస్తారని, ఆ తర్వాత మహాభారత ప్రాజెక్ట్ పైకి వెళ్తారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



