బన్నీ అభిమానులకు గుణశేఖర్ కానుక
on Jan 13, 2015
అల్లు అర్జున్ అభిమానుల కోసం దర్శకుడు గుణశేఖర్ సంక్రాంతి కానుక ఇవ్వబోతున్నారట.అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రుద్రమదేవి సినిమాలో మరో ప్రధాన పాత్ర అయిన గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ చేస్తున్న విషయం తెలిసిందే. గోన గన్నా రెడ్డి ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ ని మూటగట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే, ఈ సంక్రాంతి కానుకగా గుణశేఖర్ మేకింగ్ ఆఫ్ గోన గన్నా రెడ్డి రిలీజ్ చేస్తాడట. జనవరి 15న ఉదయం 9గంటలకు సంక్రాంతి కానుకగా ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.