చరణ్ అబద్ధాలు చెప్తున్నాడా?
on Oct 1, 2014
సినిమా రంగం అంటేనే మాయ. ఎవరికి హిట్టుంటే... అక్కడ హీరోలు ప్రత్యక్షమవుతారు. ఎవరికి ఇమేజ్ ఉంటే వాళ్లచుట్టే దర్శకులు తిరుగుతుఉంటారు. నిర్మాతలు ఎవరికి మార్కెట్ ఉంటే వాళ్ల నామమే స్మరిస్తారు. ఎవరి లెక్కా తప్పు కాదు. అయితే ఒకే ఒక్క సినిమాతో జాతకాలు మారిపోతుంటాయి. అలా ఆగడుతో తన జాతకాన్ని మార్చుకొన్నాడు శ్రీనువైట్ల. ఇది వరకు శ్రీను పేరు చెబితే... ''ఓ యస్'' అని చెప్పే హీరోలు, ఇప్పుడు వై.. నో అంటున్నారు. రామ్‌చరణ్ కూడా ఇలానే మాట మార్చాడు. ''నేను విజయాల వెంట పడను. కథే ముఖ్యం'' అని నిన్నటి ప్రెస్‌మీట్లో డాంభికాలు పోయిన చరణ్ నిజ స్వరూపం తన మాటల్లోనే తేలిపోయింది. శ్రీనువైట్లతో సినిమా ఉందో, లేదో ఇప్పుడే చెప్పలేనని, మంచి కథ చెబితే అప్పుడు ఆలోచిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు చరణ్. నిజానికి రెండు నెలల క్రితం `శ్రీనువైట్ల ఓ మంచి కథ చెప్పాడని, శ్రీను వైట్ల సినిమాల మాదిరిగానేయాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆ కథ ఉంద`ని మీడియాకు చెప్పిన చరణ్.. ఇంతలోనే మాట మార్చాడు. శ్రీను తనకు కథే చెప్పలేదని బుకాయిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి?? ఆగడుకు ముందు చరణ్ .. కర్చీప్ వేసుకొన్నాడంతే. ఆగడు హిట్టయితే... ''నాకుమాటిచ్చావ్‌కదా..'' అంటూ శ్రీనుతో సినిమా ఓకే చేయించుకొందుడు. కానీ ఆగడు ఫ్లాప్ అవ్వడంతో ఆ కర్చీప్ తీసేసి, మరో దర్శకుడిపై వేయడానికి రెడీ అవుతున్నాడు. చరణ్ పడేది కథల వెంటకాదు, విజయాలున్న దర్శకుల వెంటే అని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి..??
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



