టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్
on Jan 21, 2017

వెరైటీ కథాంశంతో రీసెంట్‌గా రిలీజైన "ద్యావుడా" మూవీ టీజర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. న్యూఇయర్ కానుకగా వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆలోచింపచేస్తుండగా..సంప్రదాయ వాదులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ టీజర్లో శివుడిపై అసభ్యకర రీతిలో సన్నివేశాలు చిత్రీకరించడంతో వాటిని చూసిన కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు అవి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు చిత్ర దర్శకుడు సాయిరాంను అరెస్ట్ చేసి విచారించారు. ఆ విచారణలో భాగంగా మనదేశంలోని కొన్ని దేవాలయాల్లో శివుడిని సిగరెట్లు, మద్యంతో పూజిస్తారని వాటి స్పూర్తితోనే సినిమాలో ఆ సన్నివేశాల్ని చిత్రీకరించామని, ప్రస్తుతం వాటిని సినిమా నుంచి తీసివేశామని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



