అయ్యో.. అంజలిని పట్టించుకోరా?
on Jan 19, 2016
డిక్టేటర్పై తెలుగమ్మాయి అంజలి గంపెడాశలు పెట్టుకొంది. ఈ సినిమా హిట్టయితే.. టాప్ లీగ్లో చేరిపోవొచ్చని కలలు కంది. సినిమా ప్రమోషన్లోనూ చురుగ్గా పాల్గొంది. టీవీ ఇంటర్వ్యూలలో అంజలిదే హవా. బాలయ్య కూడా అంజలిని సావిత్రితో పోలుస్తూ కాంప్లిమెంట్లు ఇచ్చేశాడు. తీరా చూస్తే... డిక్టేటర్లో అంజలి అదరగొట్టింది అంతంత మాత్రమే. సినిమా చూసొచ్చాక.. సోనాల్ చౌహాన్ హాట్ భంగిమల గురించో, ఓ పాటలో మెరిసి మాయమైపోయిన ముమైత్ ఖాన్గురించో మాట్లాడుకొన్నారు తప్ప... అంజలి ప్రస్తావనే రావడం లేదు.
డిక్టేటర్లో అందరితో పాటే అంజలి కూడా. అంతే తప్ప.. ప్రత్యేకంగా ఈ సినిమా వల్ల రాజోలు పాపకు ఒరిగిందేం లేదు అన్నది తేటతెల్లమైపోయింది. దాంతో అంజలి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఎంత చేసినా.. నన్ను పట్టించుకొనేవారే లేరేంటి? అంటూ మూతి ముఫ్పై మూడు వంకర్లు తిప్పుకొంటోందట. అందుకే డిక్టేటర్ సక్సెస్ మీట్కీ అంజలి డుమ్మా కొట్టిందని టాక్. అదృష్టం కలసి రాక అంజలికి తగిన గుర్తింపు దక్కడం లేదు. డిక్టేటర్ కూడా అంజలికి అన్యాయమే చేసిందిప్పుడు.
Also Read