చిరు పవన్ మధ్య కోల్డ్ వార్ ముగిసిందా?
on Aug 24, 2015
.jpg)
మెగా ఫ్యామిలీలో ఎవరి ఫంక్షన్ జరిగినా పవన్ ఫ్యాన్స్ గడబిడ చేయడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా బన్నీ, చరణ్, చిరంజీవి సినిమా ఫంక్షన్లలో పవన్ ఫ్యాన్స్ ప్రసంగాలకు ఆటంకం కలిగిస్తున్నా వారు మౌనంగా భరిస్తున్నారు. కానీ చిరు బర్త్ డే ఫంక్షన్ లో కూడా ఇదే హడావిడి జరగడంతో నాగబాబు సహనం కోల్పోయారు. దమ్ముంటే..పవన్ దగ్గరకెళ్లి స్లోగన్స్ ఇవ్వాలని నాగబాబు ఫైర్ అవుతూ చెప్పారు.
నాగబాబు ఫైర్ మహిమో ఏమో తెలీదు కానీ తెల్లారేసరికి హైద్రాబాద్ వచ్చిన పవన్ మధ్యాహ్నానికల్లా చిరంజీవి ఇంటికెళ్లి విషెస్ చెప్పారు. రాత్రికి జరిగిన పార్టీ పూర్తయ్యే వరకూ అక్కడే వుండి హడావుడి చేశారు. ఇదంతా చూసిన ఇండస్ట్రీ వర్గాలు వీరిద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ముగిసిందా? లేదా? అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ చర్చల్లో ఓ ఆసక్తికర అంశం బయటపడినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
నిజానికి ఫ్యాన్స్ మీట్ కు రమ్మని పవన్ ను ఆహ్వానించారు. కానీ ఆయన రానని ముందే చెప్పేసారు. అందుకనే చిరు బర్త్ డే వేడుకల్లో పవర్ స్టార్ ఎక్కడంటూ ఫ్యాన్స్ అల్లరి చేయడంతో నాగబాబు సీరియస్ అయి బార్డర్లు దాటాల్సివచ్చిందట. ఈ సమావేశం పూర్తయిన వె౦టనే నాగబాబు పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మండిపడ్డాడట. ఇంత గందరగోళానికి పవన్ రాకపోవడమే కారణమని చిరు కూడా గుర్రుగా వున్నట్టు చెప్ప్దాడట.
అందుకనే పవన్ షూటింగ్‌ని మధ్యలోనే రద్దు చేసుకుని స్పెషల్ ఫ్లైట్ లో హైదరబాద్ వచ్చి..నేరుగా అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే శుక్రవారం నాటి ఫంక్షన్‌కి తాను హాజరు కాకపోవడంపై అన్నయ్యకు పవన్ సంజాయిషీ ఇచ్చుకున్నట్లు సమాచారం. అయితే ఇదంతా పవన్ నాగబాబు కోసమే చేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. నాగబాబు ఇచ్చిన వార్నింగ్ పని చేసిందని అంటున్నారు. అయితే ఇప్పటికైనా వీరిద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ముగిసిందా? లేదా? మెగా అభిమానుల క్వశ్చన్..!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



