ఏంటీ రభస: జూ.ఎన్టీఆర్ నిర్మాతకు బెదిరింపు!
on Aug 11, 2014
.jpg)
జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రభస' సినిమా ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం విడుదల కాకుండా వాయిదా పడి ఆగస్టు 29న రిలీజ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న జూ. ఎన్టీఆర్ అభిమానులు వాయిదా పడటంతో ఆగ్రహంతో ఉన్నారు.
దీంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ కాల్స్, మెసేజ్ చేస్తూ బెదిరిస్తున్నారని, సినిమాను షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయకపోవడంతో ఈ బెదిరింపులు వస్తున్నాయని బెల్లకొండ సురేష్ తెలిపారు. మళ్లీ తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాన్నారు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'రభస'.. ఆగస్టు 29న విడుదల చేస్తామని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.
రభస చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్. ప్రణీత ముఖ్యమైన పాత్ర చేస్తోంది. తమన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు అభిమానుల నుండి రెస్పాన్స్ బాగానే ఉంది. గత కొంత కాలంగా సరైన హిట్ లేని జూ. ఎన్టీఆర్ ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



